Welcome to my page

Apr 6, 2011

ఇండో-లంక సమరం-2011

April 2, 2011- another memorable day in my life..
            శనివారం.. ఆఫీసు నుండి తొందరగా బయలుదేరి మ్యాచ్ టైంకి ఇంటికి చేరుకుందాం అనుకున్న..కాని మధ్యాహ్నం 3   వరకు ఆఫీసు లోనే ఉండాల్సి వచ్చింది. . అప్పటికే శ్రీలంక batting అని తెల్సి హమ్మయ్య ఇక మన ఇన్నింగ్స్ చూడవచ్చు కదా అనుకుని దొరికిన (వెలుగు) బస్సు ఎక్కా... ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లయిట్ ఉంటె బాగుండనిపించింది( సినిమా లో లాగా)..ఇంటికి వెళ్లేసరికి tv దగ్గర min నలుగురు ఉంటారనుకున్న..కానీ నాకు shock ఎదురయ్యింది..tv ముందు ఒక్కళ్ళూ లేరు సరికదా అది off చేసి ఉంది..అందరు మ్యాచ్ బయటే చూస్తున్నారట..సర్లే కానీ మనం ఇప్పటికే మిస్ అయింది చాల్లే అనుకుని టీవీ on చేసి మన ఇన్నింగ్స్ starting నుండి చూద్దాం అని అలా on చేశా..ఇంకేముంది .. అప్పటికే వీరేంద్రుడు మన లాగే మ్యాచ్ చూస్తున్నాడని తెల్సింది.. మరి కొంతసేపటికి సచినుడు కూడా వీరూకి తోడై నిరాశపరిచాడు..అయినాసరే మన Ten(Ton) కోసమైనా ఈ మ్యాచ్ గెలుస్తామని చెప్పిన match winners మాటలు గుర్తొచ్చాయి..కొంతసేపు ఆ మాట నిలుపుకొని Kohli మురిపించి అవుట్ అయ్యాడు..కొంత నిరాశ చెంది ఎందుకో tv9 స్విచ్ చేశా..ఈ మ్యాచ్ గురించే ఆ ప్రోగ్రాం..మన audience మాట్లాడుతున్నారు..ఇంకో 2 వికెట్స్ పోయిన మ్యాచ్ మనదే అని..మనోల్ల మాట నిజం చేస్తూ అప్పటికే ఊపు మీదున్న Gambhir కి కొంచం ఆలస్యంగానైన Mahi తోడయ్యాడు..World Cup Warmup match లో లాగా మన Dhoni చెలరేగాడు..ఆ ఆట చూస్తే ధోని career తొలి రోజులు గుర్తొచ్చాయి..చాలా రోజుల తర్వాత ధోని అవసరమైన సమయం లో పరుగుల వరద పారించాడు..Gambhir-Dhoni భాగస్వామ్యం మ్యాచ్ ని మలుపు తిప్పింది..అయినా order లో next చిచ్చర పిడుగులున్నారు..ఇక trophy మనదే అని నమ్మకం వచ్చేసింది..97 runs వద్ద Gambhir అవుట్ అయిన తర్వాత ధోని కి యువి(man of the tournament)  తోడయ్యాడు..ఇక ఆఖర్లో Dhoni తన style లో 6  బాది లాంచనం పూర్తి చేసాడు..121 కోట్ల (121,01,93,422) భారతీయుల కల నెరవేరింది..నాకు మాత్రం ఆ రోజు Dhoni ఆట ఒక్కటే mystery గా మిగిలింది..anyway Dhoni is one of match winners of  this match..Captaincy భాద్యతలు అంత కష్టం గా ఉంటాయేమో..(అప్పట్లో సచిన్ కూడా అంతే).. Dhoni ఈ ఆటను కొనసాగిస్తే మరిన్ని ట్రోఫి లు మనవే..Al d best Dhoni..Al d best India.. 
Score>>.http://www.espncricinfo.com/icc_cricket_worldcup2011/engine/current/match/433606.html

Men in BLUE with trophy-2011
   రావణుడు టాస్ విషయం లో మౌనం వహించినా అంతిమంగా సీత మనదే... 
Match Winners

కళ నిజమైంది ....21 యేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది..:-)